ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత సాధించని రైతులకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.

ఆగస్ట్ 2న సీఎం చంద్రబాబు దర్శి మండలంలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతులకు తొలి విడతగా ఒక్కో రైతుకు ₹5,000 చొప్పున ₹2,342.92 కోట్ల నిధులు జమ కానున్నాయి. కేంద్రం రూ.2,000 సాయం కలిపి మొత్తం ₹7,000 లబ్దిదారుల ఖాతాల్లోకి వస్తుంది. రైతులకు ముందుగానే సమాచారం అందించేందుకు ‘మనమిత్ర’ ద్వారా సందేశాలు పంపనున్నారు.