దిగ్విజయంగా కొనసాగుతున్న అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర

-

తిరుమల కొండపై సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహాన్ని, ఆంజనేయస్వామి విగ్రహాన్ని పున:ప్రతిష్ఠ చేయాలని కోరుతూ జైభారత్, అన్నమయ్య గృహ సాధన సమితి సంయుక్త అధ్వర్యంలో అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విజయ శంకర స్వామి నేతృత్వంలో అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర  జరుగుతోంది. గత నెల రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ రథయాత్ర వరంగల్ జిల్లాలోని వెయ్యి స్తంభాల గుడికి చేరుకుంది.

జై భారత్

జై భారత్ సేకరించిన 11 లక్షల యాభై వేల సంతకాలను ఆలయ అర్చకులు గంగు ఉపేందర్ శర్మ, శ్రావణ్‌లు పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో విజయ శంకర స్వామి మాట్లాడుతూ.. 2003లో తిరుమల కొండపై కూల్చేసిన సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహాన్ని, ఆంజనేయ విగ్రహాన్ని యథాస్థానంలో టీటీడీ బోర్డు వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. అందుకు జై భారత్ ఆధ్వర్యంలో 11 లక్షల యాభై వేల సంతకాలను సేకరించామన్నారు.

అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి దున్న లక్ష్మేశ్వర్ మాట్లాడుతూ.. తెలుగు భాషకు ప్రాణం పోసిన తొలి వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. తిరుమల కొండపై అన్నమయ్యకు జరిగిన అన్యాయంపై ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. తిరుమల కొండపై అన్నమయ్య గృహాన్ని, ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించే వరకు రాష్ట్రంలో అన్నమయ్య గృహ సాధన సమితి తరఫున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో అన్నమయ్య గృహ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరన్న, జైభారత్ జాతీయ కార్యదర్శి సత్యనారాయణ గోల, జైభారత్ బీసీ పోరాట వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకన్న,  జైభారత్ ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర  కార్యదర్శి ఇమ్మయ్య, ,  జైభారత్ రాష్ట్ర నాయకులు పంబాల రాజు, రాఘవదాస్, సాంబశివరావు, సంజీవ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version