కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రూపాయి కూడా కేటాయించకపోవడంతో జాతీయ పార్టీలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉండగా.. మరో జాతీయపార్టీ కాంగ్రెస్ కు తెలంగాణ ఉంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం 16 మంది ఎంపీలు కలిసి రాష్ట్రానికి తీసుకొచ్చింది గుండు సున్నా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించాయి.
‘రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష ఫలితంగా బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా బడ్జెట్‌లో రాష్ట్రానికి గుండుసున్నా మిగిలింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో రూ.50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేళపెట్టగా, తెలంగాణకు ప్రత్యేకంగా ఒక్క పైసా కూడా కేటాయించలేదు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు గానీ, కార్యక్రమాన్నిగానీ ప్రకటించలేదు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా నిధులు సాధించడంలో విఫలమయ్యారు.
‘మోదీ మా బడేభాయ్.. కేంద్రం నుంచి నిధులు ఎలా రాబట్టుకోవాలో మాకు తెలుసు’ అంటూ రేవంత్‌రెడ్డి చెప్పుకున్న గొప్పలన్నీ గప్పాలని తేలిపోయింది’ అంటూ రాసుకొచ్చారు.
తెలంగాణకు గుండుసున్నా.. బడ్జెట్‌లో పైసా విదిల్చని కేంద్రం
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష ఫలితంగా బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా… pic.twitter.com/CRDuo9vLFy
— BRS Party (@BRSparty) February 2, 2025