నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ప్రకటన విడుదల..!

-

దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరం 2021-22 ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. ఈ పరీక్షలో విద్యార్థులు ఎంపికైతే చాలు.ఇంటర్‌ వరకు ఉచిత చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. నవోదయ విద్యాలయాల్లో ఉన్నతమైన విద్య బోధన లభిస్తుంది. ఈ జవహర్‌ నవోదయాలు దేశవ్యాప్తంగా 661 ఉన్నాయి. ఏపీలో 15, తెలంగాణలో 9 ఉన్నాయి. 2020-2021 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదువుతున్న విద్యార్థులు నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్టుకు అప్లై చేసుకోవచ్చు. కేవలం ఒకసారి మాత్రమే విద్యార్థులు పరీక్ష రాయగలరు. 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతంలో చదివిన విద్యార్థులతో భర్తీ చెయ్యగా, మిగిలిన 25 శాతం ఇతర ప్రాంతాల విద్యార్థులకు అవకాశం ఇస్తారు. దీనిలో ముఖ్యంగా మొత్తం ఖాళీ ఉన్న సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయించడం విశేషం.

నవోదయ విద్యాలయాల్లో అత్యున్నత బోధన లభిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం అనేక మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అవుతారు. ఈ పరీక్షలో ఎంపికైన వాళ్లు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత చదువుతోపాటు వసతి, భోజనం కూడా పొందుతారు. ఉన్నత విద్యా బోధనకు నవోదయ విద్యాలయాలు పెట్టింది పేరు. ఇక్కడ సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తారు. ఇక్కడ రెగ్యులర్‌ చదువతోపాటు నీట్‌, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తారు.

2020-2021 విద్యా సంవత్సరంతో 5వ తరగతి చదువుతున్న వారు అర్హలు. విద్యార్థుల వయసు మే 1, 2008 – ఏప్రిల్‌ 30, 2012 మధ్య జన్మించి ఉండాలి. ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరితేది డిసెంబరు 15, 2020. పరీక్ష తేదీ ఏప్రిల్‌ 10, 2021. మరిన్ని వివరాలకోసం నవోదయ వెబ్‌ సైట్ లో ‌ https://navodaya.gov.in . చూడచ్చు. ఈ పరీక్ష విధానం ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. విద్యార్థి కోరుకున్న మీడియంలో అంటే తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ లో పరీక్ష రాసుకోవచ్చు. మొత్తం100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. అందులో మూడు సెక్షన్లు కలిపి 80 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలుంటాయి. మొత్తం పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. దీనిలో ఎటువంటి నెగిటివ్‌ మార్కులు ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news