2025 క్యాలెండర్ సెలవుల ప్రకటన.. ఉత్తర్వులిచ్చిన సీఎస్ శాంతికుమారి

-

వచ్చే సంవత్సరం -2025కు సంబంధించి సాధారణ, ఆప్షనల్ సెలవులను తెలంగాణ సర్కార్ ఖరారు చేసింది. కొత్త ఏడాదిలో మొత్తంగా 27 సాధారణ, 23 ఆప్షనల్ సెలవులు కలిపి మొత్తం 50 సెలవు దినాలను నిర్దారించారు.ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ, ఆప్షనల్ సెలవులను ఒక్కసారి పరిశీలిస్తే..

న్యూ ఇయర్ 1 జనవరి నెల, భోగి 13-జనవరి, సంక్రాంతి/పొంగల్‌ 14 , అదే నెలలో గణతంత్ర దినోత్సవం 26, మహాశివరాత్రి 26-ఫిబ్రవరి, హోలీ 14-మార్చి, ఉగాది 30-మార్చి, 31-మార్చి రంజాన్‌, జగ్జీవన్‌ రాం జయంతి 5-ఏప్రిల్‌, శ్రీరామ నవమి 6-ఏప్రిల్‌, అంబేడ్కర్‌ జయంతి 14, గుడ్‌‌ఫ్రైడే 18, బక్రీద్‌ 7-జూన్‌, మొహర్రం 6-జూలై, బోనాలు 21, స్వాతంత్ర దినోత్సవం 15-ఆగస్టు, కృష్ణాష్టమి 16-ఆగస్టు, వినాయకచవితి 27-ఆగస్టు, మిలాద్‌-ఉన్‌-నబీ 5-సెప్టెంబరు, బతుకమ్మ 21-సెప్టెంబరు, మహాత్మాగాంధీ జయంతి 2-అక్టోబరు, విజయదశమి మర్నాడు 3-అక్టోబరు, దీపావళి 20-అక్టోబరు, కార్తీక పౌర్ణమి 5-నవంబరు, క్రిస్మస్‌ 25-డిసెంబరు, బాక్సింగ్‌ డే 26-డిసెంబర్‌గా నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news