వైసీపీ నేతలకు కడపలో పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఎంపిడివో జవహర్ బాబును పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ అనంతరం మాట్లాడారు. అధికారులపై దాడి చేస్తే వదిలేది లేదని… వైసిపి నేతల కళ్ళు నెత్తిన పెట్టుకోని ఉన్నారు కిందకి దించుతానంటూ హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎంపిడివో పై దాడి చేసిన 12 మంది వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అనుచరులకు వార్నింగ్ ఇచ్చారు.

అధికారుల పై దాడులు గత ప్రభుత్వం లాగా వదిలేది లేదన్నారు. దాడిపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ స్పందించిన తీరు హర్షణీయం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విధులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. పరారీ లో ఉన్న వాళ్ళను వెంటనే పట్టుకోవాలని తేల్చి చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సుదర్శన్ రెడ్డి లాయర్ అయినా తప్పు చేస్తే ఏ చట్టం నిన్ను రక్షించలేదని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.