మహారాష్ట్ర అసెంబ్లీకి ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రధాన పార్టీలు ఎన్నికల పోరు కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్,ఎన్సీపీ (శరదపవార్), ఉద్దవ్ థాక్రే (శివసేన యూటీబీ) పార్టీలు ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. అయితే, సీఎం అభ్యర్థి ఎవరనేది మాత్రం ముందుగా ప్రకటించలేదు.
ఈ క్రమంలో అధికార బీజేపీ తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో కీలక హామీలు ప్రకటించింది. సంకల్పపత్ర పేరిట కేంద్ర హోంమంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేశారు. విద్యార్థులకు నెలకు రూ.10వేలు, మహిళలకు నెలకు రూ.2100, ఆశావర్కర్లకు రూ.15వేలు, 25వేల మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాల భర్తీ, కరెంట్ చార్జిల్లో 30 శాతం రాయితీ వంటి కీలక హామీలను ప్రకటించింది. 5 ఏళ్లలో 25 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది.