తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు సిఎం కెసిఆర్. మరో 100 ఆరోగ్య మహిళ కేంద్రాలు ఏర్పాటుకు రంగం సిద్దం చేశారు. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఆరోగ్య మహిళ కేంద్రాలను మరో 100 కేంద్రాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు ఈ నెల 12 న ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు అదేశాలు జారీ చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 272 ఉండగా..తాజాగా మరో 100 ఆరోగ్య మహిళ కేంద్రాలు ఏర్పాటుకు రంగం సిద్దం చేశారు. దీంతో ఆరోగ్య మహిళ క్లినిక్స్ 372కు పెరగనున్నాయి.
కాగా,ఇవాళ ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ సిఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ బలిదానానికి సంస్మరణగా 40వ రోజు షియా ముస్లింలు జరుపుకునే అర్బాయిన్ సందర్భంగా తోలుత ఈనెల 6న ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. తాజాగా ఆ సెలవును 7వ తేదీకి మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అర్బాయిన్ జరుపుకునే ప్రాంతాల్లో ఇవాళ సెలవు ఉండనుంది.