వావ్.. వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్..!

-

ప్రస్తుతం మెసేజింగ్ యాప్ లలో ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తూ దూసుకుపోతున్న వాట్సాప్ ఎప్పటికప్పుడు తమ సేవలను మెరుగు పరుచుకుంటూ సరి కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు తమ వినియోగదారుల అందరికీ అందుబాటులోకి తెస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుత మెసేజింగ్ యాప్ అన్నిటిలో ఎక్కువ మంది వినియోగదారులు కలిగిన యాప్ గా వాట్సాప్ కొనసాగుతోంది.

ఇక ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ తమ వినియోగదారుల అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ సిద్ధమైంది. తమ వినియోగదారుల ప్రైవసీకి భంగం కలగకుండా ఉండేందుకు ఈ సరికొత్త ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని వాట్సాప్ భావిస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ లో ఒక చాట్ ని మ్యూట్ చేసేందుకు ప్రత్యేకమైన ఫీచర్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఎనిమిది గంటలు లేదా ఒక నెల, సంవత్సరం మ్యూట్ చేయడానికి మాత్రమే వీలు ఉంటుంది. కానీ ప్రస్తుతం వాట్సాప్ తీసుకొచ్చిన ఆల్వేస్ అనే ఫీచర్ ద్వారా మాత్రం జీవితకాలం పాటు ఆ చాట్ ను మ్యూట్ లోనే ఉంచే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version