తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం లో రూ. 750 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది మలబార్ గ్రూప్. తెలంగాణలో గోల్డ్ డైమండ్ జ్యువలరీ తయారీ ఫ్యాక్టరీ తో పాటు రిఫైనరీని ఏర్పాటు చేయనున్న మలబార్ గ్రూప్.. దీని కారణంగా… 2500 మందికి పైగా నైపుణ్యం కలిగిన స్వర్ణ కారులకు ఉపాధి అవకాశం కలుగనుంది.
తెలంగాణలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ వాతావరణం, ఇక్కడి ప్రభుత్వం పాలసీలను పరిగణలోకి తీసుకొని ఈ పెట్టుబడి నిర్ణయం తీసుకున్నామని మలబార్ గ్రూప్ స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్ కి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కేటీఆర్. మలబార్ గ్రూప్ కి అన్ని విధాలుగా సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. ఈ మేరకు మలబార్ గ్రూప్ చైర్మన్ యంపి. అహ్మద్ బృందంతో హైదరాబాద్ సమావేశమైయ్యారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆ కంపెనీకి భరోసా కల్పించారు.