Big Boss Non Stop Telugu: ‘బిగ్ బాస్’లో మరో ‘లవ్ స్టోరి’..చిలకా గోరింకలు బిందు మాధవి-అఖిల్!

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ గత సీజన్స్ లో కంటెస్టెంట్స్ మధ్య లవ్ స్టోరిలు పుట్టుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేమ మరింత పెరిగిన వారు ఉండగా, విడిపోయిన వారు కూడా ఉన్నారు. కాగా, తాజాగా ‘బిగ్ బాస్’ ఓటీటీ షోలో మరి కొత్త లవ్ స్టోరి స్టార్ట్ అయిందన్న డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతోంది.

గత సీజన్స్ అన్నీ కూడా టెలివిజన్ లో టెలికాస్ట్ కాగా, ఈ సారి ఓటీటీలో 24 బై 7 షోగా కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ కొంచెం బోల్డ్ గానే డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నారు. గేమ్ లో భాగంగా వారు చేసే కామెంట్స్ ఒక్కోసారి చాలా దారుణంగా ఉంటాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే..‘బిగ్ బాస్’ ఓటీటీలో మరో ‘లవ్ స్టోరి’ తెర మీదకు వచ్చింది.

గురువారం స్ట్రీమ్ అయిన ఎపిసోడ్ లో ఎట్టకేలకు శివ కెప్టెన్ అయ్యాడన్న సంగతి తెలిసింది. అయితే, ఈ క్రమంలోనే మిగతా కంటెస్టెంట్స్ కొందరు సంచాలక్ గా అషురెడ్డి వ్యవహరించిన తీరుపైన అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా, ఈ క్రమంలోనే మరో ‘లవ్ స్టోరి’ గురించి ఇన్ డైరెక్ట్ సంకేతాలు వచ్చాయి.

గతంలో తిట్టుకున్న అఖిల్ – బిందు మాధవి ప్రజెంట్ అండర్ స్టాండింగ్ తో గేమ్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అజయ్…అఖిల్ తో మాట్లాడుతూ..‘చిలకా-గోరింకలు’గా అఖిల్ -బిందు మాధవి ఉన్నారని అంటాడు. అలా అన్నపుడు అఖిల్ బ్లష్ అవుతుండటం చూడొచ్చు. అది చూసిన నెటిజన్లు ఈ లవ్ ట్రాక్ ఎక్కడి వరకు వెళ్తుందోనని కంటెస్టెంట్స్ తో పాటు బీబీ లవర్స్ చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news