అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణకు వర్షసూచన

-

తూర్పు అరేబియా సముద్రం మీదుగా మరో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో ఏపీ, తెలంగాణలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఫెంగల్ తుఫాను తీరం దాటడంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ ప్రభావం తగ్గిన కొద్ది గంటలకే తూర్పు అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడినట్లు తెలుస్తోంది.

ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా తోడైనట్లు సమాచారం. దీంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడనున్నాయి.ఇక తెలంగాణలోనూ మోస్తారు వర్షాలు కురిసే చాన్స్ ఉంది. ఇప్పటికే గత 3 రోజులుగా హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమై ఉంది. తాజా అల్పపీడనంతో మరో మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version