హైదరాబాద్ లో మరో ప్రైవేట్ కంపెనీ షాక్ ఇచ్చింది. డిక్యు ఎంటటైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ (అనిమేషన్) తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఎండీ తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో సంస్థలో పని చేసిన ఉద్యోగులు ఫిర్యాదు చేసారు. 6 నెలల నుండి జీతాలు లేక రోడ్డున పడ్డామని 14 వందల మంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసారు.
ఒక్కొక్కరికి 14లక్షలు రావాలని ఉద్యోగులు పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ లో సంస్థ ఎండీపై ఫిర్యాదు చేసారు. ఎండీ మరో విజయ మాల్య కాకుండా అతని పాస్పోర్ట్ సీజ్ చేసి,అతని పై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని బాధితులు మానవ హక్కుల కమీషన్ కు విజ్ఞప్తి చేసారు. తమ సాలరీలు అడిగితే వేధిస్తూ… కంపెనీ నుండి తొలగిస్తామని భయాందోళనకు గురిచేస్తున్నారని ఉద్యోగులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.