కరోనాతో పురుషులకే ఎక్కువ ప్రమాదం..వచ్చే 90 రోజులు అత్యంత కీలకం.

-

కరోనా వైరస్‌ వ్యాప్తిపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు..వచ్చే 90 రోజులు కరోనా మరింత విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాసరావు..కరోనా వైరస్‌ను పూర్తిగా జయించలేదని..మరింత గడ్డుకాలం ముందుందన్నారు శ్రీనివాసరావు..వైరస్‌కు ఇప్పటి వరకూ వ్యాక్సిన్ రాలేదని..వచ్చే వరకూ ఇంకా చాలా కాలం పడుతుందని అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..నిర్లక్ష్యం చేస్తే అది మరింత ప్రమాదకంగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు.
కరోనా వైరస్‌ స్త్రీల కంటే పురుషులపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుందన్నారు..పెద్ద పండులన్ని ముందున్నాయని..పండుగ సమయంలో తగు జాగ్రత్త అవసరమని హెచ్చరించారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ ..చలి కాలంలో కరోనా వ్యాప్తి మరింత ఎక్కువ ఉంటుందన్నారు..ఈ కాలం వైరస్‌కు అనుకూలంగా మారుతుందని వచ్చే మూడు నెలలు అందరూ జాగ్రత్తంగా ఉండాలని..మరి ముఖ్యంగా పురుషులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలన్నారు..

Read more RELATED
Recommended to you

Latest news