ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు హతం

-

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య బీజాపూర్ జిల్లాలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. తెలంగాణ సరిహద్దు వెంట ఉన్న దక్షిణ బీజాపూర్ జిల్లాలోని ఉసూర్ బాసగూడ, పమేడ్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూబింగ్ నిర్వహిస్తున్నాయి.

ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఒక్కసారిగా రెండు వైపుల నుంచి కాల్పులు చోటు చేసుకోగా సుమారు గంటన్నర పాటు కొనసాగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం బీజాపూర్ జిల్లా హెడ్‌క్వార్టర్స్ నుంచి సుమారు 130 కి.మీ. దూరంలో ఉందని ప్రాథమిక సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news