ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిజామాబాద్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో దిల్ రాజు సంక్రాంతి పండుగకు ఆంధ్రాలా తెలంగాణలో వైబ్స్ ఉండదు. తెల్ల కల్లు, మటన్ మాంసం మీద వైబ్స్ ఉంటాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ టికెట్ల ధరల పెంపుపై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అయ్యా దిల్ రాజు తెలంగాణలో వైబ్ లేకుంటే సినిమాలు మానుకో. వైబ్ కావాలంటే కల్లు కంపౌండ్, మాంసం దుకాణం పెట్టుకో అని సూచించారు.
దిల్ రాజు ఏనాడు తెలంగాణ వ్యక్తిగా వ్యవహరించలేదన్నారు. తెలంగాణ ప్రజల సంస్కృతిని అవమానించేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సినిమా టికెట్ల ధరలు పెంచమన్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పుడు ధరల పెంపు పై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణీ మరోసారి బయటపడిందని.. గేమ్ ఛేంజర్ కి ప్రత్యేక మినహాయింపులు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.