ఈ మధ్య కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేస్తారని, త్వరలోనే వారికి పదవులు వర్తిస్తాయని చాలామంది పేర్లు తెరమీదకు వస్తున్నాయి. బీజేపీ పెద్దలు ఆయా రాష్ట్రాల్లో బలపడేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలకు త్వరలోనే కేంద్ర మంత్రి పదవులు ఇస్తారని, అందులో భాగంగా ఇప్పటికే చాలా మందిని మారుస్తున్నారనే ఊహాగానాలు మిన్నంటాయి.ఈ మార్పుల్లో భాగంగానే బీజేపీ పెద్దలు సౌత్ ఇండియాపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ telangana లో బలపడేందుకు పక్కాగా పావులు కదుపుతోంది. అందుకోసం మరో ఎంపీకి కేంద్ర సహాయ మంత్రి పదవిని ఇస్తారని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ప్రస్తుతం కేంద్ర హోం సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు.

ఇక త్వరలోనే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావుకు కేంద్ర గిరజన శాఖ సహాయ మంత్రిగా అవకాశం ఇస్తారని సమాచారం. ప్రస్తుతం కేంద్ర గిరిజన శాఖ వ్యవహారాల మంత్రిగా ఉన్న అర్జున్ ముండాతో పాటుగా సహాయ మంత్రిగా పనిచేస్తున్న రేణుక సింగ్ సరుటను త్వరలోనే మారుస్తారని, అందులో భాగంగా రేణుక సింగ్ స్థానంలో గిరిజన శాఖ సహాయ మంత్రిగా బాబూరావును నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదివాసీల్లో పట్టు కోసమే ఆయనకు ఈ పదవి ఇస్తున్నారుని తెలుస్తోంది.