BSNL నుంచి మరొక కొత్త ఆఫర్.. కేవలం 135 రూపాయలతో 1440 నిమిషాలు ఫ్రీ.. !!

-

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఇప్పుడు మొబైల్ ప్రీపెయిడ్ యూజర్లు ఇబ్బంది పడకుండా తన వినియోగదారులకు ఒక మంచి ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. అదేంటంటే కేవలం రూ.135 వోచర్‌ తీసుకున్న వారు 1440 నిమిషాల పాటు ఏ నెట్ వర్క్ వినియోగదారులకు అయిన ఫోన్ చేసుకుని మాట్లాడుకునే అవకాశం కల్పించింది. అయితే ఇదే ఆఫర్ గతంలో 300 నిమిషాలకు మాత్రమే పరిమితమై ఉండేది.కానీ ఇప్పుడు ఈ సరి కొత్త టారిఫ్ వోచర్ 24 రోజుల వ్యాలిడిటీతో అదనపు ప్రయోజనాలు కలిగి ఉంది.

 

ఇకపోతే ఈ టారిఫ్ యొక్క ప్రయోజనాలు చుస్తే. BSNL వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు అనేవి ఆఫ్-నెట్, ఆన్-నెట్.. రెండింటిలోను ఉంటాయి. అంటే లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఏ నెట్ వర్క్‌కు అయినా నిరభ్యన్తరంగా చేసుకోవచ్చు. అంతే కాకుండా అక్టోబర్ 22వ తేదీలోగా రూ.160తో రీఛార్జ్ చేసుకున్న వారికి అంతే మొత్తాన్ని మూడు రోజుల పాటు వినియోగించుకునే సరికొత్త అవకాశం కుడా కస్టమర్లకు అందిస్తోంది. అంతేకాకుండా BSNL పండగ సీజన్ సందర్భంగా కొన్ని ప్లాన్స్ కూడా అందుబాటులోకి తెచ్చింది.

అవేంటంటే సెలెక్ట్ ప్లాన్ వోచర్స్ (PV), స్పెషల్ టారిఫ్ వోచర్స్ (STV) పైన బీఎస్ఎన్ఎల్ అధనపు వ్యాలిడిటీని ఇస్తోంది. ఇకపోతే ఈ ప్లాన్స్ యొక్క వివరాలు గురించి తెలుసుకుంటే రూ.147 నుంచి, రూ.247, రూ.699, రూ.999 గా ఉన్నాయి. 147 రూపాయల ప్లాన్ గురించి తెలుసుకుంటే ఈ ప్లాన్ 5 రోజుల వాలిడిటీతో ముగుస్తుంది. అలాగే 247 రూపాయల ప్లాన్ అనేది 10 రోజుల వాలిడిటీతో ముగుస్తుంది. ఇంకా 699 రూపాయల ప్లాన్ వాలిడిటీ చూస్తే 20 రోజులు గడువుతో ముగుస్తుంది. 999 రూపాయల ప్లాన్ వాలిడిటీ 60 రోజుల గడువుతో ముగుస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీలు అన్ని అంతకముందు కన్నా ఇప్పుడు పొడిగించిబడిన ప్లాన్ వివరాలు.. !!

Read more RELATED
Recommended to you

Exit mobile version