మంచిర్యాల‌లో మ‌రో ఆనంద‌య్య‌.. నాటుమందుతో రెండు గంట‌ల్లోనే కోలుకుంటున్న పేషెంట్లు

-

ఈ క‌రోనా సెకండ్ వేవ్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అంద‌రిలో భ‌యాలు పెరిగిపోయాయి. ఇలాంటి టైమ్‌లో నెల్లూరు జిల్లాలోని కృష్ణ‌ప‌ట్నం ఆనంద‌య్య త‌యారు చేసిన నాటుమందు అంద‌రికీ ఓ వ‌రంలా క‌నిపిస్తోంది. ఆ మందు వేసుకుంటే రెండు గంటల్లోగా కొవిడ్ పేషెంట్లు కోలుకుంటున్నారు. దీంతో అంద‌రూ ఆ మందుకోసం వెయిట్ చేస్తున్నారు.

 

అయితే ఇప్పుడు తెలంగాణ‌లో కూడా ఓ ఆనంద‌య్య వెలుగులోకి వ‌చ్చాడు. ఆయ‌న వేస్తున్న నాటుమందు కూడా రెండు గంట‌ల్లోనే పేషెంట్ల‌ను నార్మ‌ల్ స్థితికి తెస్తోంది. మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామానికి చెందిన బచ్చలి భీమయ్య క‌రోనాకు మందును క‌నిపెట్టాడు.

భీమ‌య్య గతంలో సింగరేణి కార్మికుడిగా పని చేసి పదవీ విరమణ పొందాడు. త‌న‌కు వార‌స‌త్వంగా వ‌చ్చిన ఆయుర్వేద విద్యను ఉప‌యోగించి 13మూలిక‌ల‌తో ఈ క‌రోనా నాటుమందును త‌యారుచేశాడు. ఆయ‌న మాట్లాడుతూ ఇప్పటి వరకు 300 మంది కరోనా పేషెంట్లను తన మందుతో ఆరోగ్యవంతుల్ని చేశానని చెబుతున్నాడు. మందు వేసిన రెండు గంట‌ల్లోనే కొవిడ్ పేషెంట్లు కోలుకుంటున్నార‌ని చెబుతున్నాడు. అయితే పోలీసుల‌కు ఈ విష‌యం తెలిసింది. మందమర్రి సీఐ ప్రమోద్ రావు మాట్లాడుతూ… భీమ‌య్య మందుకు ఎలాంటి శాస్త్రీయత లేదని, కాబ‌ట్టి ప్ర‌జ‌లు తీసుకోవ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం నుంచి దీనిపై ఎలాంటి ఆర్డ‌ర్లు లేవ‌ని, కాబ‌ట్టి ప్ర‌జ‌లు న‌మ్మొద్ద‌ని తెలిపాడు. కానీ ప్ర‌జ‌లు మాత్రం భీమ‌య్య మందును వాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version