సుశాంత్​ సింగ్​కు మరో అరుదైన గౌరవం.. కాలిఫోర్నియా స్టేట్​ అసెంబ్లీలో సత్కారం

-

దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ.. భారతీయ సినిమాకు సుశాంత్​ సింగ్​ చేసిన కృషిని గుర్తిస్తూ.. కాలిఫోర్నియా స్టేట్​ అసెంబ్లీలో అతడికి గౌరవ సత్కారం లభించింది. అమెరికాలో నివాసముంటున్న సుశాంత్​ సోదరి శ్వేతా సింగ్​ కీర్తికి అతని తరఫున ఈ సర్టిఫికేట్​ను అందజేశారు. ఈ క్రమంలోనే హాలీవుడ్​ సినిమాల్లో నటించాలనేది తన చిరకాల కోరికగా సుశాంత్​ తరచూ చెబుతుండేవాడని శ్వేత తెలిపింది.

susanth
susanth

మరోవైపు శ్వేత భర్త విశాల్​ మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సుశాంత్​కు ఈ గౌరవాన్ని అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సుశాంత్​ కేసుకు సంబంధించి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అమెరికాలోని భారతీయులు నిత్యం గమనిస్తున్నారని అన్నారు.ప్రస్తుతం సుశాంత్​ కేసు విచారణలో భాగంగా ఈడీ, సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులతో పాటు కేసుతో సంబంధమున్న పలువురిని ఈడీ అధికారులు విచారించారు.

Read more RELATED
Recommended to you

Latest news