జానీ మాస్టర్‌కు మరో షాక్.. ఆ అసోసియేషన్ అధ్యక్షుడిగా తొలగింపు?

-

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.అనంతరం బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు ఆమె ఇంట్లోనే 3 గంటలు విచారించారు. ఆమెకు వైద్య పరీక్షలు సైతం చేయించారు. అయితే, పోలీసులు విచారణలో బాధితురాలు కీలక విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్‌కు వ్యతిరేకంగా ఇండస్ట్రీ చిన్మయి, పూనమ్ కౌర్ వంటి వారు విమర్శలు చేస్తున్నారు.

 

తాజాగా ఆయనకు మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జానీ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆ పదవి నుంచి జానీని తొలగించడంతో పాటు అసోసియేషన్ నుంచి ఆయన్ను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. జానీ తనను లైంగికంగా వేధించడంతో పాటు బయటకు ఈ విషయం తెలిస్తే చంపేస్తానని బెదిరించినట్లు అతని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version