కోలీవుడ్ స్టార్ హీరోకి మళ్ళీ షాక్ ..?

-

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కి తమిళంలో పాటు తెలుగులోను ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. గజినీ తో సూర్య మార్కెట్ అటు తమిళంలోను ఇటు తెలుగులోను బాగా పెరిగింది. నాలుగేళ్ళ క్రితం వరకు కోలీవుడ్ లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో అంటే సూర్య అనే చెప్పేవారు. కానీ గతకొన్నేళ్లుగా సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిల పడుతున్నాయి. వరుస ఫెయిల్యూర్స్‌తో తెలుగులో పాటు తమిళంలోను సూర్య మార్కెట్ క్రమంగా పడిపోయింది.

 

ఇక సూర్య గత చిత్రాలు ‘NGK’, ‘బందోబస్త్’ సినిమాలకు తెలుగులో ఓపెనింగ్స్ కూడా రాలేదు. అదే గతంలో సూర్య సినిమా అంటే ఒక తెలుగు స్టార్ హీరో కి ఉన్న క్రేజ్ తో ప్రేక్షకులు థియోటర్స్ కి పరిగెత్తేవారు. కాని ఇప్పుడు అలా జరగడం లేదు. ఇక సూర్య తాజాగా ‘గురు’ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో ‘సూరారై పొట్రు’ అనే తమిళ సినిమాలో నటించాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తెలుగులో ఈ సినిమా ‘ఆకాశమే నీ హద్దురా’ అనే టైటిల్ రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమాని ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. అపర్ణ..జాకీష్రాఫ్,పరేష్ రావల్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తుండగా జీవీ ప్రకాష్ సంగీతమందిస్తున్నాడు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. అయితే రిలీజ్ సిద్దమైన ఈ సినిమాకి కరోనా బ్రేక్ వేసింది. అంతేకాదు విజయ్ సినిమాతో సూర్య బాక్సాఫీస్ వద్ద పోటీ పడాలనుకున్నాడు.

అసలే వరుస ఫ్లాప్స్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూర్య ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకొని బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదని సూర్య ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. ఇక ప్రస్తుతానికి లాక్ డౌన్ కారణంగా తమిళ సినిమాలు కూడా రిలీజ్ చేయడనికై మేకర్స్ భయపడుతున్నారట. ఇది సూర్య కి గట్టి దెబ్బే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version