తారకరత్న కోసం బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. కుప్పంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో భాగంగా తారకరత్న స్పృహ తప్పి పడిపోవడం తెలిసిందే.హుటాహుటిన హాస్పిటల్ కు తరలించగా ఆయనకు గుండెపోటు వచ్చిందని వైద్యులు ప్రథమ చికిత్సలో భాగంగా నిర్ధారించారు.
వెంటనే బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించి అక్కడ మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, తారకరత్న ఆస్పత్రిలో ఉండగానే, ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ కారుకు రెండు రోజుల కిందట ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన మరువక ముందే, నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ కారుకు ఏదో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే… ఈ సంఘటన లో నందమూరి చైతన్య కృష్ణ కు ఎలాంటి ప్రమాదం జరుగులేదట. కారు వేగంగా వెళుతుంటే, ఆయన కారు పంక్చర్ అయిందట. దీంతో వేరే కారులో వెళ్లినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.