అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ గట్టి తగిలింది. భార్య మెలానియాతో ట్రంప్ వివాహ సంబంధాలు తెగిపోయినట్టు తెలుస్తోంది. ఈ విషయాలను స్వయంగా మెలానియా ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ చెప్పినట్టు అగ్రరాజ్యంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ట్రంప్ వైట్ హౌస్ నుంచి బయటకు రాగానే మెలానియా అతనికి విడాకులు ఇవ్వబోతోందన్న వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
2005 జనవరి 22న ట్రంప్, మెలానియాల పెళ్లి జరిగింది. అయితే, 15 సంవత్సరాల వారి వివాహ బంధం త్వరలో విచ్ఛిన్నం కాబోతోందని, దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అగ్రరాజ్య విశ్వసనీయ సమాచారం. అమెరికాలో అధ్యక్షుడి భార్యగా ఉండడం అంటే అత్యంత గౌరవప్రదమైన అంశం. అమెరికాలో ఫస్ట్ లేడీకి కూడా దేశ అధ్యక్ష్యుడికి ఉన్నంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఆమె ఇన్నాళ్లూ విడాకుల ప్రస్తావన తీసుకురాలేదని అదేకాక.. ట్రంప్‌కి, మెలానియాకి మధ్య ఎప్పటినుంచో విభేదాలున్నాయని అయినా అధ్యక్ష పదవిలో ఉండగా మెలానియా ఆయనకు విడాకులు ఇచ్చి అవమాన పరచాలని అనుకోలేదని అంటున్నారు. ఇప్పుడు ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల ఆయన వైట్‌హౌస్ వీడిన వెంటనే మెలానియా కూడా ఆయన నుంచి విడిపోనున్నారని చెబుతున్నారు.
నిజానికి ట్రంప్ అధ్యక్షుడు అయిన వెంటనే మెలానియా ట్రంప్‌తో పాటు శ్వేతసౌధానికి రాలేదు. ట్రంప్ వచ్చిన 5 నెలలకు ఆమె శ్వేతసౌధానికి వచ్చారు. అయితే అప్పుడు ఆమె కొడుకు బారెన్ స్కూలింగ్ కోసమే వైట్ హౌస్‌కి రాలేదన్న వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి. అయితేనేం వీరిరువురి మధ్య సఖ్యత సరిగా లేదని చాలా సార్లు బహిరంగంగానే వెల్లడయ్యింది. ఈ కారణం వల్లనేమో మెలానియా ట్రంప్‌కు విడాకులు ఇస్తారని అక్కడి వారు అనుకుంటున్నారు. మరి ఏమైవుతుందో.. అగ్రరాజ్యంలో ఇంకెన్ని షాకింగ్ న్యూస్‌లు వినపడనున్నాయో వేచి చూడాల్సిందే.