ఇండస్ట్రీలో మరో విషాదం.. 41 ఏళ్లకే నటి మరణం..

-

ఇండస్ట్రీలో విషాదాలు విరామం లేకుండా జరుగుతూనే వస్తున్నాయి. ఇప్పటికే ఎందరో నటీనటులను పోగొట్టుకున్న ఇండస్ట్రీ తాజాగా మరొక షాకింగ్ సంఘటన ఎదుర్కొంది. ప్రముఖ మలయాళీ నటి సుబి సురేష్ అతి చిన్న వయసులోనే కన్ను మూయటం అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది..

మలయాళీ నటి సుబి సురేష్ మల్టీ టాలెంటెడ్ గా పేరు సంపాదించుకున్నారు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరియర్ను స్టార్ట్ చేసిన సుబి.. తర్వాత అనేక వేదికలపై స్టేజ్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చారు. క్రమంగా టీవీ కార్యక్రమం లో హొస్ట్ గా వ్యవహరించారు. సినిమాల్లో సైతం నటించి మెప్పించారు. ఇప్పటివరకు దాదాపు 20 చిత్రాల్లో నటించి అలరించారు..

గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు సుబి సురేష్. ముఖ్యంగా కాలేయ సంబంధిత వ్యాధితో పోరాడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈమె ఆరోగ్యం క్షీణించడంతో కొచ్చిలోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేయగా అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. అయితే కేవలం 41 సంవత్సరాలకు ఈమె మరణించడం అందరినీ కలిచి వేస్తుంది. ఈ సందర్భంగా అభిమానులంతా సుబి సురేష్ నటించిన చిత్రాలు, బుల్లితెర కార్యక్రమాలను గుర్తు చేసుకుంటున్నారు. అయితే గత 15 రోజులుగా ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. కాలేయ దాత కోసం ప్రయత్నించినప్పటికీ వీలుపడలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఈమె కామెడీ ఫీల్డ్ లో ఏకైక మహిళ అని, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి దాదాపు 20 ఏళ్లుగా కష్టపడుతుందని గుర్తు చేసుకుంటున్నారు ఆమెతో నటించిన నటులు. తన ఆరోగ్యం గురించి తెలుసుకునే సమయానికి అది దాదాపు చివరి దశకు వెళ్లిపోయిందని శస్త్ర చికిత్సకు ప్రయత్నించిన రక్తపోటు అధికంగా ఉండటం వల్ల సాధ్యం కాలేదు అంటూ సమాచారం..

కుటుంబ విషయానికి వస్తే సుబి సురేష్ కు తల్లి, తండ్రి ఒక సోదరుడు ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె మృతితో మలయాళీ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం సుబి సురేష్ కు సంతాపం తెలిపారు. ఎన్నో టీవీ షోలు కామెడీ కార్యక్రమాల ద్వారా మలయాళీ ప్రేక్షకుల మనసులు దోచుకున్న నటి సుబి సురేష్ దూరం అవటం ఎంతో బాధాకరం అంటూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version