ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో షాకింగ్ నిజాలు బయటపెట్టారు వైద్యులు. ప్రీతి బాడీలో ఎలాంటి విషవాయులు విష పదార్థాలు లేవని రిపోర్ట్ ఇచ్చారు వైద్యులు. ఆత్మహత్య కేసును అనుమానాస్పద మృతి గా కేసు మార్చే అవకాశం ఉందని తెలిపారు.
ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని టాక్సికాలజీ రిపోర్ట్ లో వెల్లడించారు. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లో ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్ ఇచ్చారు. కాగా, ప్రీతి.. చచ్చిపోయిన బిడ్డకు ట్రీట్మెంట్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్. చైతన్యం ను చంపేస్తే ఉన్మాదం వస్తుందని వెల్లడించారు. మనం ప్రోగ్రెసివ్ మానర్ లో ఉన్నామా? రిగ్రసివ్ మేనర్లో ఉన్నామా ? అని నిలదీశారు ఈటల రాజేందర్. అసైన్డ్ భూములు తీసుకుంటే మార్కెట్ ధర ప్రకారం వారికి నష్ట పరిహారం చెల్లించాలన్నారు.