ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకులంతా ఏకమైపోయి ఎమ్మెల్సీ అనంతబాబుకు అండగా ఉన్నా కూడా అరెస్టు ఆపలేకపోయారు. ఓ విధంగా దళిత సామాజికవర్గం బలమైన సామాజికవర్గంపై సాధించిన విజయం ఇది. అది కూడా జగన్ ఊళ్లో లేని సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీని అరెస్టు చేయించడం అంటే అంత సులువు అయిన పని కాదు. ఆ విధంగా మేరుగ నాగార్జున అనే దళిత మంత్రి గెలిచాడు.
ఈ విషయమై ఇప్పటికీ అదే దళిత సామాజిక వర్గానికి చెందిన తానేటి వనిత మాట్లాడకపోయినా, మేరుగ నాగార్జున కృషి అయితే ఫలించింది. నిన్నటి వేళ శ్రీకాకుళం పర్యటనకు వచ్చి అందరి కన్నా ముందే అది హత్య అని తేల్చారు మంత్రి వర్యులు., కానీ బొత్స మాత్రం ఆయన్ను వెనకేసుకుని వచ్చే ప్రయత్నమేదో చేశారు. విపక్ష ఆరోపణల ప్రకారం సకల శాఖల మంత్రి కూడా దీనిపై మాట్లాడలేదు. ఇదే ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్టుకు దారి ఇస్తుంది. అరెస్టు సరే బెయిల్ పై బయటకు వస్తే బాధితులకు ప్రాణ రక్షణ ఉంటుందా ?
కులం కార్డు ఆధారంగా అనంతబాబును ఏమీ అనలేం కానీ అంటే గింటే పాపం ఎప్పుడో ఆయన్ను అనాలి..అని కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటున్నారు. పాపం ఓ దళితుడు నిండు ప్రాణం కోల్పోయాక, అనేక తర్జనభర్జనల తరువాత అనంత బాబు అరెస్టు కావడంలో వింతేం లేదు అని కూడా అంటున్నారు. ఏదేమయినా కాపు కులానికి చెందిన అనంత బాబుపై ఇప్పటికీ పోలీసు చర్య ఒకటి షురూ కావడం ఓ వింత కదా ! ఇదే అనంత బాబు గతంలో బాబు హయాంలో కూడా రెచ్చిపోయారు అని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చెప్పకనే చెబుతున్నాయి. ఆ విధంగా అనంతబాబును పోలీసులు అరెస్టు చేయడంతో ఇప్పుడు ఆయనకు కొత్త కష్టం ఒకటి వచ్చింది.
దళితుడి హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడు అని బాధితురాలి భార్య బుర్రను నేలకు కొట్టుకుని మరీ చెబుతోంది. కానీ పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇదే విధంగా ఎందరో బాధితులు ఉండవచ్చు. అంటే అవన్నీ మానసిక హత్యలు అని అర్థం. కేవలం ప్రాణం తీయడం మాత్రమే కాదు ఇలాంటి హత్యలు అంతకంటే భయం పురిగొల్పే విధంగా ఉండవచ్చు కూడా ! ఆ విధంగా అనంతబాబు పేరు ఇప్పుడు రికార్డుల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ మార్మోగిపోతోంది. ఆయనకు బలమయిన రాజకీయ నేపథ్యం ఉంది. అదేవిధంగా కులం కార్డు కూడా ఉంది. అదే ఇప్పుడు ఓ విధంగా పోలీసు చర్య ఏ విధంగా ముందుకు వెళ్తుందో అన్న అనుమానాలకు తావిస్తోంది.