వాల్తేరు వీరయ్య నుంచి బిగ్ అప్డేట్.. పూనాకాలు అంటూ వచ్చేసిన చిరు,రవితేజ

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజు రవితేజ చాలాకాలం తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్నారు. అన్నయ్య సినిమాలో మెరిసిన ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సందడి చేసేందుకు రెడీ అవుతోంది.

చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్యలో రవితేజ కీలకపాత్రలో కనిపించనున్నారు. రవితేజ ఇందులో ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో కనిపిస్తున్నాడు.రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది.

అయితే, తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డ్‌ డేట్‌ వచ్చింది. పూనకాలు లోడింగ్‌ అంటూ సాగే ఈ పాటను రేపు రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version