దుల్కర్ సల్మాన్ ” సీతారామం” నుంచి మరో వీడియో సాంగ్ రిలీజ్

-

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కిన సినిమా “సీతారామం”.. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. దుల్కర్ సల్మాన్ రామ్‌గా.. బాలీవుడ్ బ్యూటీ మృణాళ్‌ ఠాకూర్‌ సీతగా నేషనల్ క్రష్ రష్మిక మంధన్న కీలక పాత్రలో నటించారు. ‘అందాల రాక్షసి’, ‘పడి పడి లేచె మనసు’ వంటి సున్నితమైన ప్రేమకథలను తెలుగు ప్రేక్షకులకు అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.

వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ ‘సీతారామం’ సినిమాను నిర్మించారు. ఈ సినిమా మంచి కథనంతో రూపొందింది..1985 ప్రాంతం నాటి కథ..పాకిస్తాన్ మేజర్ అయిన తారిఖ్ తన మనవరాలు అఫ్రీన్( రష్మిక మందాన)కి ఓ బాధ్యత అప్పజెబుతాడు. ఇండియాకు చెందిన మహాలక్ష్మి(మృణాళి ఠాగూర్) ఎక్కడుందో కనుక్కొని ఆమెకు ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ రామ్(దుల్కర్ సల్మాన్) 20 ఏళ్ల క్రితం రాసిన లెటర్ అందజేయాలని చెబుతాడు.

మహాలక్ష్మి కోసం అఫ్రీన్ అనేక పాట్లు పడుతుంది. అయితే లెఫ్టినెంట్ రామ్, మహాలక్ష్మికి పరిచయమే లేకపోగా, ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది వంటి విషయాల పై సినిమా కథ ఉంటుంది..పీరియాడికల్ డ్రామాగా సీతారామం చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు.ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే తాజాగా కృష్ణాష్టమిని పురస్కరించుకొని ఈ సినిమా నుండి మరో వీడియో సాంగ్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ” తరలి తరలి మరి రారా ఎదురుగా” అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version