ప్రియాంక రెడ్డి ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. అదే ప్రాంతంలో మ‌రో దారుణం..

-

శంషాబాద్ ప‌రిధిలో చోటు చేసుకున్న వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ ప్రియాంక రెడ్డి హ‌త్యోదంతం మ‌రువ‌క ముందే అదే ప్రాంతంలో అలాంటిదే మ‌రొక దారుణం చోటు చేసుకుంది. శంషాబాద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని సిద్ధుల గుట్ట స‌మీపంలో కొందరు గుర్తు తెలియని దుండ‌గులు ఓ మ‌హిళ‌ను హ‌త్య చేసి కాల్చి వేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ప్రియాంక రెడ్డి హ‌త్య‌కు సంబంధించి సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ మీడియాకు వివ‌రాల‌ను వెల్ల‌డిస్తున్న స‌మ‌యంలోనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం మ‌రింత క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

another woman burnt at shamshabad after priyanka reddy incident

కామాంధుల కాటుకు బ‌లైన ప్రియాంక రెడ్డి త‌ర‌హాలోనే మ‌రొక ఘ‌ట‌న అదే శంషాబాద్‌లో చోటు చేసుకోవ‌డం అల‌జ‌డి సృష్టిస్తోంది. ప్రియాంక రెడ్డిని దుండ‌గులు హ‌త్య చేసిన‌ట్లుగానే సిద్ధుల గుట్ట‌లోనూ కొంద‌రు దుండ‌గులు ఓ మ‌హిళ‌ను దారుణంగా హ‌త్య చేసి పెట్రోల్ పోసి మృత‌దేహాన్ని త‌గుల‌బెట్టారు. స‌ద‌రు మ‌హిళ వ‌య‌స్సు 35 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉంటుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఘ‌ట‌న జ‌రిగిన తీరును ప‌రిశీలించ‌డంతోపాటు ఆ మ‌హిళ గురించిన వివ‌రాల‌ను ఆరా తీస్తున్నారు. కాగా ప్రియాంక రెడ్డి త‌ర‌హాలోనే ఈ ఘ‌ట‌న కూడా చోటు చేసుకోవ‌డం పోలీసుల‌కు మ‌రింత స‌వాల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news