తెలుగు సినీ ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్ గా పేరు పొందారు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా కొన్ని దశాబ్ద కాలం పాటు సినీ రంగానికి ఎన్నో సేవలు అందించారు. ఎన్నో సాంఘిక, జానపద ,పారాణిక, చారిత్రాత్మక చిత్రాలలో కూడా నటించిన ఘనత సంపాదించారు అక్కినేని నాగేశ్వరరావు. ఇక నాగేశ్వరరావు చివరిసారిగా తన కుటుంబంతో కలిసి మనం సినిమాలో నటించారు. చివరి రోజుల్లో కూడా తన పాత్రకి తాను డబ్బింగ్ చెప్పుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు.
బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సినిమాలను విడుదల చేసి మంచి విజయాలు అందుకున్న నాగేశ్వరరావు. తాను నటించిన ఒక సినిమా ఇప్పటికీ విడుదల కాలేదనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆచిత్రమే ప్రతిబింబాలు ఈ సినిమా దాదాపుగా 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు థియేటర్లో విడుదల చేయడానికి పలు సన్నహాలు చేస్తున్నారు. ఏఎన్ఆర్ మరియు జయసుధ ఈ చిత్రంలో జంటగా నటించారు. ఇందులో తులసి మరొక కథానాయక కూడా నటించింది. 1982లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా కొన్ని కారణాల చేత ఈ సినిమా అప్పట్లో విడుదల కాలేక పోయిందట.
అయితే ఎన్నోసార్లు ఈ సినిమాని విడుదల చేయడానికి ప్రయత్నించిన ఆర్థికపరమైన లావాదేవీలు సెటిల్మెంట్ కాలేకపోవడంతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు అయితే ఇప్పుడు.. నవంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 250 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రాన్ని కూడా 4k మరియు డిటిఎస్ టెక్నాలజీతో మార్చి విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ నవంబర్ లో ముహూర్తం కుదిరిందని తెలిపారు.