కొంతమంది పిల్లలు మనం చెప్పిన మాటని అస్సలు వినరు. పైగా వాళ్ళు మంచి పద్ధతుల్ని పాటించకుండా వారికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. మంచి, చెడు అస్సలు గ్రహించరు. ఇలాంటి పిల్లలని మనం అలా వదిలేస్తే మంచిగా మారడానికి అవ్వదు. అందుకని తల్లిదండ్రులే పిల్లల ప్రవర్తని కరెక్ట్ చేస్తూ ఉండాలి. లేదంటే వారిలో మార్పు రాదు సరి కదా ఎవరి మాట అస్సలు వినరు
కాబట్టి తల్లిదండ్రులే వాళ్ళ ప్రవర్తనని కరెక్ట్ చేయాలి.
అర్ధం చేసుకోండి:
మొదట మీరు మీ యొక్క పిల్లలని అర్థం చేసుకోండి. అప్పుడే మీరు వాళ్లని కరెక్ట్ చేయడానికి అవుతుంది.
భయపెట్టకండి:
చాల మంది తల్లితండ్రులు భయ పెడుతూ వుంటారు. తిట్టడం, కొట్టడం వంటివి చేస్తారు. ఇలా చేస్తే మాత్రం వాళ్ళు మారరు తెలుసుకోండి.
రూల్స్ ని సింపుల్ గా ఉండనివ్వండి:
వాళ్ళు ఫాలో అయ్యే లాగే రూల్స్ ఉండాలి. రూల్స్ ని సింపుల్ గా ఉంటే వాళ్ళు ఆచరిస్తారు. కనుక రూల్స్ ని సింపుల్ గా ఉండనివ్వండి.
కూల్ గా చెప్పండి:
మీరు కోపంగా చెప్తే వాళ్ళు వినరు. ఇది మంచి, ఇది చెడు అని కూల్ గా చెప్పండి. అప్పుడే వాళ్ళు వినే అవకాశం వుంది. కొంతమంది పిల్లలు మనం చెప్పిన మాటని అస్సలు వినరు. వారికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. అలంటి వాళ్ళని మాత్రం వదిలేయకూడదు. మంచి, చెడు చెప్పాలి. అప్పుడే భవిష్యత్తు లో వాళ్ళు మంచిని అనుసరిస్తుంటారు.