దేశంలోని ప్రజలంతా ప్రస్తుతం చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి కారణంగా సతమతవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యం లో తెలంగాణ రాష్ట్రం లో గొర్రెలను ఓ కొత్త వ్యాధి కబలిస్తోంది. వరంగల్ జిల్లా దుగొండి మండలం చాపల బండ లో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం రేపుతోంది. చాపల బండ లో ఇప్పటి వరకు నాలుగు గొర్రెలు ఆంత్రాక్స్ వ్యాధి భారీన పడి మరణించాయి.
వ్యాధి లక్షాణాలున్నా… గొర్రెలను గ్రామా నికి దూరంగా.. ఉంచాలని యజమానులను అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా వేటర్నరీ అధికారులు మాట్లాడారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా గొర్రెలకు టీకాలు ఇస్తున్నామని పేర్కొన్నారు అధికారులు. పరీక్షల కోసం నమూనాలను హైదరాబాద్ ల్యాబ్ కు పంపినట్లు పేర్కొన్నారు. ల్యాబ్ నివేదికలు వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఈ విషయంలో ప్రజలు ఆందోలన చెందాల్సిన అవసరం లేదన్నారు.గొర్రెలకు వచ్చిన ఈ వ్యాధి చాలా సహజమని చెప్పిన వెటర్నరీ అధికారులు ఎవరూ భయ పడొద్దన్నారు.