ప్రీతి సూసైడ్ కేసు.. యాంటీ ర్యాగింగ్ కమిటీ నివేదికలో వెలుగులోకి కీలక విషయాలు

-

వరంగల్ కేఎంసీ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి  ఆత్మహత్య కేసు రాష్త్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అధికారులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ప్రీతిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన వ్యక్తులు, పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. మరోవైపు  యూజీసీ ఆదేశానుసారం… వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది.

దాదాపు 4 గంటలకుపైగా కమిటీ సభ్యులు ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. మెడికో ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ మానసికంగా వేధించాడని యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ధారించింది. కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మోహన్​దాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 13 మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగిన మీటింగ్​లో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానకి ముందు జరిగిన పరిణామాలపై చర్చించారు.

ఈ సమావేశంలో ప్రీతికి కౌన్సిలింగ్ ఇచ్చిన వైద్యులెవరు? సీనియర్ సైఫ్​తో కలిసి ప్రీతి ఎన్నిసార్లు రాత్రి విధులు నిర్వహించింది ? సీనియర్​ సైఫ్​, ప్రీతికి మధ్య విభేదాలు తలెత్తడానికి గల కారణాలపై చర్చ జరిగింది. గత సంవత్సరం నవంబర్ 18న అడ్మిషన్ పొందిన వైద్య విద్యార్థిని ప్రీతికి, సైఫ్​కు భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయన్న అంశాలపై ప్రధానంగా ఈ కమిటీ చర్చించింది. ప్రీతిపై సైఫ్.. పీజీ విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో హేళన చేస్తూ ప్రీతిని కించపర్చేవిధంగా పోస్టులు పెట్టినట్లు కమిటీ నిర్ధారించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version