ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తప్పిన ప్రమాదం

-

బీఆర్‌ఎస్ నేత, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. కీసర రింగ్ రోడ్డుపై అకస్మాత్తుగా కుక్కలు అడ్డు రావడంతో ముందు వెళ్తున్న వాహనదారుడు సడెన్ బ్రేక్ వేశాడు. ఆ వెనకాల ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఉన్న వాహనం ముందు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. అనుచరులు ఆయనకు ప్రథమ చికిత్స చేశారు. బుధవారం ఉదయం కీసరలో ఓ కార్యక్రమానికి హాజరైన సుభాష్ రెడ్డి.. అక్కడ నుంచి ఉప్పల్ తిరిగి వస్తుండగా కుషాయిగూడ సమీపంలో కీసర రింగ్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ఎమ్మెల్యే వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలిసి కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం నుంచి తాను సురక్షితంగా ఉన్నానని, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని భేతి సుభాష్ రెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన కాన్వాయ్‌లోని రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version