గీతా గోవిందం అను చేయాల్సిందా..!

-

నాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అను ఎమ్మాన్యుయెల్. ఆ తర్వాత యువ హీరోలతో నటిస్తూ పవర్ స్టార్ తో అజ్ఞాతవాసి, స్టైలిష్ స్టార్ తో నా పేరు సూర్య సినిమాలు చేసింది. అయితే రెండు పెద్ద సినిమాలు చేసినా సరే అమ్మడికి లక్ మాత్రం కలిసి రాలేదు. ఆ రెండు సినిమాలు డిజాస్టర్ అవడంతో అను కెరియర్ లో సందిగ్ధంలో పడింది. ఈమధ్యనే నాగ చైతన్య జోడీగా చేసిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా కూడా నిరాశ పరచింది.

ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా చేస్తున్న అను ఎమ్మాన్యుయెల్ ఇటీవల వచ్చి బాక్సాఫీస్ సంచలనంగా మారిన గీతా గోవిందం సినిమాను మిస్ చేసుకుందని చెప్పింది. విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వచ్చిన గీతా గోవిందం సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. కాని ఆ సినిమా కథ మొదట అను దగ్గరకు వచ్చిందట. అయితే అప్పటికే నా పేరు సూర్య సినిమా చేస్తుండటం వల్ల గీతా గోవిందం వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది. అయినా సరే సినిమాలో తనకు ఓ చిన్న పాత్ర ఇచ్చి సక్సెస్ లో భాగం చేశారని చెబుతుంది అను. కెరియర్ అంత ఆశాజనకంగా లేకపోయినా కచ్చితంగా మళ్లీ తన సత్తా చాటేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తుంది అను ఎమ్మాన్యుయెల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version