కాజల్ కు క్రేజీ ఆఫర్

-

కెరియర్ దాదాపు అయిపోయింది అనుకున్న టైంలో కాజల్ వరుస సినిమాలు చేస్తుంది. ఖైది నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు కాజల్ కెరియర్ మళ్లీ ఊపందుకునేలా చేశాయి. ప్రస్తుతం తేజ డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న కాజల్ మరో లక్కీ ఆఫర్ కూడా సొంతం చేసుకుందని తెలుస్తుంది. అది కూడా కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోతో జతకట్టే ఛాన్స్ అని తెలుస్తుంది.

శంకర్ డైరక్షన్ లో కమల్ చేయబోతున్న భారతీయుడు సీక్వల్ ఇండియన్ 2 సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను సెలెక్ట్ చేశారట. కమల్ తో సినిమా అంటే ఇక కాజల్ లక్ గురించి ఏం చెప్పినా తక్కువే. ప్రస్తుతం 2.ఓ ముగింపు దశలో ఉండగా శంకర్ వచ్చే ఏడాది మొదట్లోనే ఇండియన్ 2 స్టార్ట్ చేస్తాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంతోమందిని అనుకోగా ఫైనల్ గా కాజల్ ఓకే అయ్యిందట. ఈ సినిమా కోసం కాజల్ బాగానే డిమాండ్ చేసిందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version