Anubhavinchu Raja Trailer : ”అనుభవించు రాజా” ట్రైలర్ రిలీజ్..నవ్వులు పండించిన రాజ్ తరుణ్

-

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్… చాలా డిఫరెంట్ కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఒరేయ్ బుజ్జి గా సినిమాతో తిరిగి హిట్ ట్రాక్ లో పడ్డాడు హీరో రాజ్ తరుణ్. ఇక ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్ అనుభవించు రాజా అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా శ్రీను గవిరెడ్డి.. దర్శకత్వంలో తెరకెక్కు తుండగా… అన్నపూర్ణ స్టూడియోస్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

గ్రామీణ కథాంశం నేపథ్యంలో కామెడీ కీ రోల్ గా తీసుకొని ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది… తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసింది చి త్ర బృందం. ఈ ట్రైలర్ ను నాగార్జున విడుదల చేశాడు. ఇక ఈ ట్రైలర్ లో హీరో రాజ్ తరుణ్ ఓ సెక్యూరిటీ గార్డ్ గా మనకు కనిపించాడు. అలాగే.. తనదైన నటనతో నవ్వించాడు హీరో రాజ్ తరుణ్. అంతేకాదు ఓ గ్రామీణ వాతావరణాన్ని ఈ ట్రైలర్ లో చూపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా మా నంబర్ 26 వ తేదీన విడుదల కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news