ఆ నంబర్ నాది కాదు అంటూ అభిమానులను అలర్ట్ చేసిన అనుపమ పరమేశ్వరన్..!

-

అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అనుపమ పరమేశ్వరన్ కు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ప్రస్తుతం కూడా అనుపమ పరమేశ్వరన్ 18 పేజీస్ , కార్తికేయ టు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నపటికి అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అయితే నిన్న సినిమాలోని స్టిల్స్, గర్భంతో ఉన్న ఫోటోలను అనుపమ షేర్ చేయడంతో నెట్టింట్లో ఆమె పేరు మార్మోగిపోయింది. ఇలా నిన్నంతా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన అనుపమా పరమేశ్వరన్ తాజాగా సోషల్ మీడియాలో మరొక పోస్ట్ చేసింది. తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన ఇన్ స్టా స్టోరీస్ లో ఒక నెంబర్ ను పోస్ట్ చేసి, ఇది నా నెంబర్ కాదు అని, దీని నుండి ఎలాంటి మెసేజ్ లు వచ్చిన, ఫోన్ కాల్స్ వచ్చిన రిప్లై ఇవ్వకండి అంటూ తన అభిమానులకు తెలియజేసింది. ఇలా తన అభిమానులను అనుపమ పరమేశ్వరన్ అలర్ట్ చేసింది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ చేసిన ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే అనుపమ పరమేశ్వరన్ తాజాగా నటించిన సినిమా రౌడీ బాయ్స్ సినిమా ఈ మధ్యనే థియేటర్ లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news