కేంద్ర బడ్జెట్ -2022 ను పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. కేంద్రం నూతనంగా తీసుకువచ్చే.. భూ సంస్కరణల గురించి.. కీలక విషయాలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్ పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. దేశం లో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆధునిక వ్యవస్థను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
అలాగే.. దేశంలోని పౌరుల సౌకర్యార్థం కోసం ఈ – పాస్ పోర్టులను 2022-23 నుంచి జారీ చేయనున్నట్లు నిర్మల తెలిపారు. ఇందు కోసం కొత్త సాంకేతికతను ఉపయోగించనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే… దేశం లోని నిరు పేదలకు శుభవార్త చెప్పారు. పీఎం ఆవాస యోజన పథకం కింద నిరు పేదలకు ఏకం గా 80 లక్షల ఇండ్లను నిర్మిస్తామని సంచలన ప్రకటన చేశారు. నిరుపేదలను ఆదుకునే విధంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. అలాగే..5.7 కోట్ల కుటుంబాల కు నల్ సే జల్ కింద మంచినీటిని అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు.