కేసీఆర్ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు… హుజూరాబాద్ సర్జికల్ స్ట్రైక్ తరువాత టీఆర్ఎస్ పతనం ప్రారంభం అయింది

-

సర్జికల్ స్ట్రైక్ పై నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై దేశంలో పొలిటికల్ దుమారం రేగుతోంది. తాజాగా ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. తనదైన స్టైల్లో సెటైర్లు విసురుతున్నారు.

హుజూరాబాద్ స్ట్రైక్ తరువాత… కేసీఆర్ కు కోపం ఎక్కువగా వస్తుందని… పెద్దపెద్దగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క ఎన్నికలో ఓడిపోతేనే ఇలా ఉందని.. తెలంగాణలో కేసీఆర్, టీఆర్ఎస్ పతనం ప్రారంభమైనట్లు అర్థం అవుతుందని విమర్శించారు అనురాగ్ ఠాకూర్.

పాకిస్తాన్ మాటల్లాగే కాంగ్రెస్, టీఆర్ఎస్ మాటలు ఉన్నాయని… ఎన్నికలు వచ్చినప్పుడు హిజాబ్, సర్జికల్ స్ట్రైక్ మీద మాట్లాడుతూ ఉంటారని..అభివృద్ధి విషయంలో బీజేపీతో పోటీ పడలేక ఇటువంటి విమర్శలు చేస్తుంటారని.. సర్జికల్ స్ట్రైక్ మీద మాట్లాడటం ద్వారా కేసీఆర్ మనస్తత్వం ఏమిటో తెలుస్తుందని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.

ఇదిలా ఉంటే కేసీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కేసీఆర్, కాంగ్రెస్ గాంధీ కుటుంబంపై విధేయతను ప్రకటించుకోవడానికి పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. సాయుధ బలగాలను ప్రశ్నించే వారిని వదిలేది లేదంటూ.. వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు బీజేపీ జాతీయ నేత కేంద్రమంత్రి మురళీధరన్ కూడా కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇది ఆపరేషన్ లో పాల్గొన్న సైనికులను అవమానించడమే అంటూ.. ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version