BREAKING : కడప జిల్లాలో అనూష మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు..లవ్‌ ఎఫైర్‌ కారణం !

-

వైఎస్సార్ జిల్లాలోనీ బద్వేల్ లో సంచలనం రేపిన అనూష అనే విద్యార్ధి మిస్సింగ్, అనుమానాస్పద మృతి కేసు ఛేదించారు పోలీసులు. ప్రేమ వ్యవహారమే అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాధమికంగా నిర్దారణకు వచ్చారు. మహేష్ అనే వ్యక్తి ప్రేమ వేధింపులు ఇతర కారణాలతో నీటిలో మునిగి బలవన్మరణానికి పాల్పడినట్లు నిర్ధారించారు ఎస్పీఅన్బురాజన్.

బద్వేల్ లో అనూష మిససింగ్ కేసు ను అనూష తండ్రి బద్వేల్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ చేశామని.. సిద్దవటం , నెల్లూరు , బద్వేల్ లో సిసి టివి ఫుటేజ్ ఆధారంగా విచారణ చేసినట్లు ఎస్పీఅన్బురాజన్ వెల్లడించారు. సిద్దవటం వద్ద పెన్నా నది ఒడ్డున 23 వ తేదీ అనూష శవం లబ్యమైందని.. సంఘటన స్థలంలో దొరికిన అనూష మృతదేహానికి అక్కడే పోస్ట్ మార్టం నిర్వహణ అన్నారు. బాడీ లో ఎక్కడా లోపల ,బయట ఎటువంటి గాయాలు లేవు…ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని వివరించారు జిల్లా ఎస్పీ అన్బురాజన్.

Read more RELATED
Recommended to you

Latest news