చాలా మంది ఎదుర్కొనే సమస్యలలో గుండె సమస్యలు కూడా ఒకటి. నిజానికి ఈ మధ్య కాలంలో గుండె సమస్యల వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. గుండె సమస్యలు రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనదే. గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాలుష్యం మొదలైన కారణాల వల్ల గుండె సమస్యలు పెరిగిపోతున్నాయి. అలానే కొలెస్ట్రాల్ వలన కూడా గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే మరి గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ప్రతి రోజు వ్యాయామం చేయండి:
ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల గుండె సమస్యలు రావు వ్యాయామం చేయడం వల్ల బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలు రావు. అలానే గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఎక్కువ నీళ్ళు తీసుకోండి:
శరీరాన్ని హైడ్రేట్ చేయకుండా వ్యాయామం చేస్తే రక్తం చిక్కగా ఉంటుంది రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఉండవు. గుండె ఆరోగ్యం బాగుండాలంటే తగినంత నీరు తీసుకోవాలి నీటి కొరత వలన ఒత్తిడి కూడా పెరుగుతుంది.
గుండె పరీక్ష చేయించుకోండి:
30 ఏళ్లు దాటిన తర్వాత ఏడాదికి రెండు సార్లు టెస్ట్ చేయించుకోండి దీని వలన ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తుంది.
ఫ్యాట్ తక్కువగా తీసుకుంటూ ఉండండి:
ఫ్యాట్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే కొవ్వు ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండండి.