రేపు లోక్ సభ స్పీకర్ ఎన్నిక…విప్ జారీ చేసిన టీడీపీ

-

18వ లోక్ సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.సోమవారం ,మంగళవారం సమావేశాల్లో ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బుధవారం నాడు స్పీకర్ ఎన్నిక జరగనుంది. సాధారణంగా ఏకగ్రీవం కావాల్సిన స్పీకర్ ఎన్నిక ఈసారి కాలేదు. రేపు స్పీకర్ ని ఎన్నుకోనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ విప్‌ జారీ చేసింది. పార్టీకి చెందిన 16 మంది లోక్‌సభ సభ్యులకు త్రీ లైన్‌ విప్‌ జారీ చేసింది.

రేపు లోక్‌సభకు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ చీఫ్ విప్ జీఎం హరీష్ బాలయోగి తెలిపారు. రేపు ఉదయం 11గంటల నుంచి తప్పక లోక్‌సభలో ఉండాలని , ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి ఓటు వేయాలని కూడా విప్‌లో పేర్కొన్నారు.ఇండియా కూటమి తరఫున ఏం.కే. సురేష్ ,ఎన్డీయే కూటమి తరఫున ఓం బిర్లా స్పీకర్ అభ్యర్థిగా ఉన్నారు.

రేపు ఉదయం 9.30 గంటలకు టీడీపీపీ నేత లావు శ్రీ కృష్ణ దేవరాయలు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఎంపీల సమావేశం జరగనున్నది. సమావేశంలో స్పీకర్ ఎన్నికలో ఓటింగ్ విధానంపై ఎంపీలకు శ్రీకృష్ణ దేవరాయలు అవగాహన కల్పించనున్నారు. సమావేశం అనంతరం అందరూ కలిసి పార్లమెంట్‌కు తెలుగుదేశం పార్టీ ఎంపీలు వెళ్లనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ , జనసేన సభ్యులను కూడా సమావేశానికి తెలుగుదేశం పార్టీ ఆహ్వానించనున్నది.

Read more RELATED
Recommended to you

Latest news