బాహుబలి సినిమా తరువాత అనుష్క పాపులారిటీ పెరిగిపోయింది. గత కొంత కాలంగా ఈ బెంగళూరు భామ పెళ్లిపై వరుస కథనాలు వినిపిస్తూనే వున్నాయి. మొదట అనుష్క క్రికెటర్ ని పెళ్లి చేసుకుంటుంది అని ఒక ప్రచారం జరిగింది. ఆ తర్వాత దర్శకుడు రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ ని వివాహం చేసుకుంటుంది అనే వార్త కూడా వచ్చింది. ఈ రెండు వార్తలను ఆమె ఖండించింది. కాని ఇది నిజం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ ని ఆమె పెళ్లి చేసుకోవడం ఖాయమని వారి వివాహం దాదాపుగా ఖరారు అయిందని అనుష్క చేతిలో ఉన్న సినిమాలను పూర్తి అయిన తర్వాత ఆమె ఈ వివాహం చేసుకునే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ లో ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇక త్వరలోనే అనుష్క ఎంగేజ్మెంట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన కూడా వస్తుంది అని అంటున్నారు.
త్వరలో అనుష్క ఎంగేజ్మెంట్.. ఎవరితోనో తెలుసా..?
-