ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల అలజడి నెలకొంది. తమ వారిని అరెస్టు చేస్తున్నారని, తమకు ప్రజా స్వామ్యంలో ఉండే అవకాశం లేదా? అని టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి పార్టీ సీనియర్లు పెద్ద ఎత్తున వి మర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే తమ వారిని అరెస్టు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ విషయంపై మేధావులు సైతం దృష్టి పెట్టారు. టీడీపీకికానీ, టీడీపీ నేతలకు కానీ ఏదైనా జరిగితే.. వెంటనే స్పందించే కొన్ని మీడియా పెద్దలు, మేధావులు కూడా కొద్ది రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలపై మౌనం వహించారు. దీనికి కారణమేంటి? ఎందుకు మౌనంగా ఉన్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
గతంలో చంద్రబాబును విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. దీనికి కారణాలు ఏం చెప్పినా కూడా అంతిమంగా.. పోలీసుల వైఖరిని మేధావులు, మీడియా పెద్దలు సైతం తప్పుబట్టారు. మొత్తంగా ప్రభుత్వం వైఖరిపై అప్పట్లోనే దుమ్మెత్తి పోశారు. మరి అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీ ని సమర్ధించే నాయకులు ఉన్నారే తప్ప.. మేధావులు ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటి? రాష్ట్రంలో రెండు పరిణామాలు జరిగాయి. ఒకటి మాజీ మంత్రి అచ్చెన్నాయు డు అరెస్టు, రెండు అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిల అరెస్టు. ఈ రెండు ఘటనలను మేధావులు ఎక్కడా ఖం డించలేదు.
కేవలం రాజకీయ కారణాలు చూపుతూ.. చంద్రబాబు ఆయన బృందాలు రోడ్డెక్కాయి. కానీ, మేధావులు మాత్రం ఎక్కడా పెదవి విప్పలేదు. దీనిని బట్టి అధికారులు ఏయే అంశాలను ప్రస్థావిస్తూ. వారిని అరెస్టు చేశారో.. అవి నిజమేననే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే, అరెస్టు చేసే విధానంలో కఠిన త్వం కనిపించొచ్చు. కానీ, అసలు కేసుల వెనుక ఉన్న రీజన్ విషయంలో మాత్రం తేడా లేదనేది మాత్రం వాస్తవం. అందుకే మేధావులు మౌనం పాటించారా? అనే సందేహం తెరమీదికి వచ్చింది. మసిపూసి మారేడు కాయను చేయొచ్చేమోకానీ.. చట్టాలు, నిబంధనలనే రేఖలను మాత్రం తుడిచేయలేరు కదా! ఎవరైనా?!