ట్రెండింగ్: ఏపీ స్పీకర్ కుర్చీ మారుతోందా?

-

ఏ ముహూర్తాన్న ఏపీ కేబినెట్ విస్తరణ అనే మాటలు బయటకు వచ్చాయో నాటి నుంచి ఆశావహులు పెరిగిపోవడంతో పాటు, అంచనాలూ మారిపోతున్నాయి. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాస్ చంద్రబోస్ లు రాజ్యసభకు వెళ్లే ముహూర్తం ఫిక్సయినప్పటినుంచి ఈ హడావిడి మొదలైంది. జగన్ కూడా ఆషాడం అని ఆలోచిస్తున్నాడే తప్ప లేదంటే ఈపాటికి ఈ కార్యక్రమం పూర్తి చేసేసేవాడని అంటున్నారు. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ సభాపతి తమ్మినేని సీతారాం కుర్చీ మారబోతోందనే మాటలు వినిపిస్తున్నాయి.

అవును… ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోని వైకాపా క్లోజెస్ట్ సర్కిల్ లో వినబడుతోన్న మాట ఇది! సీనియర్ లీడర్.. బీసీ సామాజికవర్గానికి చెందిన నేత.. పైగా ఇప్పుడు ప్రధానంగా ఖాళీ అయిన రెండు భారీ మంత్రి పదవులు కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలు నిర్వహించినవే కావడం తో… తమ్మినేని కూడా మంత్రి పదవిపై బెమ పడుతున్నారని అంటున్నారు! గతంలో కూడా… ఈ కుర్చీలో ఎక్కువ కాలం ఉండను, వీలైనంత త్వరగా దిగిపోతాను అని తమ్మినేని అన్నమాటను కూడా గుర్తుచేస్తున్నారు!

అటు కులసమీకరణలు.. ఇటు ప్రాంతీయ రిజర్వేషన్లు.. వాటికి తోడు అనుభవం కూడా కలిసిరావడంతో ఆయన అంచనాలు, ఆయనపై అంచనాలు కూడా పెరుగుతున్నాయని అంటున్నారు. తమ్మినేని సొంత జిల్లాకు ఒక మంత్రి పదవి అని వార్తలొస్తున్న నేపథ్యంలో… ఫ్రెషర్స్ కి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి… ఇలాంటి సీనియర్లను చక్కబెట్టేస్తే బెటరనే ఆలోచన జగన్ చేస్తే మాత్రం… కచ్చితంగా ఆ జాబితాలో తమ్మినేని పేరు ఉండొచ్చని అంటున్నారు!!

ఈ గాసిప్స్ అన్నీ నిజమైతే… ఏపీ అసెంబ్లీ కొత్త సభాపతి వస్తారన్నమాట!!

Read more RELATED
Recommended to you

Exit mobile version