ఏపీకి నాలుగు జాతీయ జల అవార్డులు.. మంత్రులను అభినందించిన సీఎం

-

ఆంధ్రప్రదేశ్ కు నాలుగు జాతీయ జల అవార్డులు రావడంపై మంత్రి అంబటి రాంబాబు, అధికారులను సీఎం జగన్ అభినందించారు. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు గాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణ రెడ్డి అవార్డును అందుకున్నారు. మరోవైపు జలవనరుల శాఖపై జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సమీపిస్తున్నకొద్దీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పై కూడా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం జగన్ ఇవాళ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తాజా పరిస్ధితిని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం మొదలుకానున్న తరుణంలో ప్రాజెక్టుల నిర్మాణంలో ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులకు తగు సూచనలు చేశారు. అలాగే ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version