ఏపీలో బీఈడీ కళాశాల ఫీజులని నిర్ధారించిన ప్రభుత్వం.. ఎంతంటే ?

-

ఏపీ వ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో ఫీజులను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణా కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని వివిధ బీఈడీ కళాశాలల్లో 2020-21 నుంచి 2022-23 సంవత్సరాల మధ్య ఫీజులను నిర్దారిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Ap government
Ap government

ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో బీఈడీ కోర్సులకు రూ. 10 వేల నుంచి గరిష్టంగా రూ. 15 వేల వరకూ ఫీజులను నిర్ధారిస్తూ ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులోనే వార్షిక ఫీజు, ట్యూషన్ ఫీజు, అఫిలియేషన్ తదితర ఫీజులు  ఇమిడి ఉంటాయని కూడా ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. అలానే కళాశాలల వారీగా రాష్ట్రంలోని 374 ప్రైవేటు, అన్ ఏయిడెడ్ కళాశాలల్లో బీఈడీ కోర్సుకు ఫీజులను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news