AP Budget 2023-24 : 2.79 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌

-

ఏపీ వార్షిక బడ్జెట్ సమావేశాలు 2023-24 ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం 2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక​ పథకానికి – రూ.21,434.72 కోట్లు, వైఎస్సార్‌ రైతు భరోసా రూ.4,020 కోట్లు, జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు, జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు, వైఎస్సార్‌- పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు, వైఎస్సార్‌ కాపు నేస్తం- రూ. 550 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version